పేర్వారం రాములుకు మాతృవియోగం

10 Jul, 2018 14:53 IST|Sakshi
 పేర్వారం వీరమ్మ (ఫైల్‌) అంతిమయాత్రలో పొన్నాల లక్ష్మయ్య 

రఘునాథపల్లి :  ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, రాష్ట్ర టూరిజం అభివృద్ధి శాఖ మాజీ చైర్మన్‌ పేర్వారం రాములుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి పేర్వారం వీరమ్మ (94) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మం డలంలోని ఖిలాషాపూర్‌లో తుది శ్వాస విడిచారు.

ఈ సందర్భంగా   ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మె ల్యే నాగపూరి రాజలింగం, జనగామ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌లు సోమవారం మృతదేహంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ మేరకు రాములును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు మారుజోడు రాంబాబు, సర్పంచ్‌ దొంగ అంజిరెడ్డి, మండల పరిషత్‌ కోఅçప్షన్‌ సభ్యుడు మహమూద్, నాయకులు గొరిగ రవి, మడ్లపల్లి సునీత, కోళ్ల రవిగౌడ్, బక్క నాగరాజు, ఉడుత రవి, దూడల యాదగిరి, లోనె శ్రవణ్‌కుమార్, దొంగ మహిపాల్‌రెడ్డి, కావటి రాజయ్య, అల్లిబిల్లి నర్సయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

అంతియయాత్రలో పాల్గొన్న పొన్నాల

రఘునాథపల్లి: ఖిలాషాపూర్‌లో సోమవారం నిర్వహించిన మాజీ డీజీపీ పేర్వారం రాములు తల్లి వీరమ్మ (94) అంతిమ యాత్రలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. తన సొంత గ్రామమైన ఖిలాషాపూర్‌లో ఆమెతో చిన్ననాటి నుంచి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

వీరమ్మ కుమారుడు రాములుతో ఎంత సఖ్యత ఉండేదో లక్ష్మయ్యతో అంతే అభిమానంగా ఉండేది. ఉన్నత విద్యాభ్యాసం చేసినా, వృత్తి పరంగా పేర్వారం, రాజకీయంగా పొన్నాల ఏ స్థాయికి ఎదిగినా ఎప్పటిలాగే కలిసి ఉండేవారు. ఈ సందర్భంగా అంతిమ యాత్రలో పొన్నాల కొద్ది సేపు పాడె మోశారు.

మరిన్ని వార్తలు