చేపమందుపై హైకోర్టులో పిటిషన్‌.. నేడు విచారణ

4 Jun, 2019 12:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చేపమందు పంపిణిని ఆపాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనావ్యాజ్యం దాఖలైంది. జూన్‌ 8న మృగశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం చేయనున్న విషయం తెలిసిందే. అయితే దానిని ఆపాలని కోరుతూ బాలల హక్కుల సంఘం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. చేప మందుకు ఎలాంటి సైంటిఫిక్‌ అథారిటి లేదని.. దానిని పంపిణీ చేయడం చట్ట విరుద్దమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. చేప మందు కోసం అనవసరంగా ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని పటిషనర్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం ఈరోజు మధ్యాహ్నాం విచారిస్తామని తెలిపింది.  

జూన్‌8, 9వ తేదీల్లో అస్తమా బాధితులకు చేప మందు పంపిణీ చేస్తామని బత్తిని మృగశిర ట్రస్ట్‌ కార్యదర్శి బత్తిని హరినాథ్‌గౌడ్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రభుత్వ సహకారంతో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.  తొలుత నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప మందును పంపిణీ చేస్తామని, అక్కడ పూర్తయిన తర్వాత దూద్‌బౌలి, కవాడిగూడ, వనస్థలిపురం, కూకట్‌పల్లిలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి అందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు