పెట్రోల్‌ రాదు.. రీడింగ్‌ మాత్రమే వస్తుంది

19 Oct, 2019 08:46 IST|Sakshi

సాక్షి,మంచిర్యాల : ఓ వాహన యాజమాని గురువారం సాయంత్రం పెట్రోల్‌ పోయించుకునేందుకు జన్నారం మండలం రేండ్లగూడ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌కు వెళ్లాడు. పెట్రోల్‌ పోసెందుకు గన్‌ తీయగానే పెట్రోల్‌ పోస్తున్నట్లు రీడింగ్‌ నడుస్తుంది. పెట్రోల్‌ రావడం లేదు. అవాక్కయిన వాహన యాజమాని అలాగే పరిశీలించారు. బైక్‌లో పెట్రోల్‌ పోయకుండానే సుమారు రూ.400 వరకు రీడింగ్, పెట్రోల్‌ మీటర్ల రీడింగ్‌ నడుస్తుంది. ఇది ఎలా జరుగుతుందని, మోసం చేస్తున్నారంటూ వాహన యాజమానులు పెట్రోల్‌ బంక్‌ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.

ఈ క్రమంలో ఇరువురికి తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై వినోద్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో శుక్రవారం జన్నారం తహసీల్దార్‌ రాజుకుమార్‌ పెట్రోల్‌ బంకుకు వెళ్లి విచారణ చేశారు. పెట్రోల్‌ పోసే గన్‌ తీయగానే రీడింగ్‌ నడుస్తుందని, ఇలా జరుగడానికి కారణంపై ఆరా తీశారు. గాలి, వర్షం, పిడుగుల కారణంగా ఇలా అయిందని, ఈ విషయాన్ని పై అధికారులకు సమాచారం ఇచ్చామని సిబ్బంది పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని తహసీల్దార్‌ పెట్రోల్‌ బంకు యాజమానికి తెలియజేసి ఇలా జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

>
మరిన్ని వార్తలు