ఓయూ ఆధ్వర్యంలోనే పీజీ ప్రవేశాలు 

10 Aug, 2019 02:56 IST|Sakshi

పీజీ ప్రవేశ పరీక్షల్లో 95.88 శాతం మంది అర్హత 

పరీక్షల ఫలితాలు వెల్లడించిన ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు పీజీ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్టు (సీపీజీఈటీ) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇందులో 95.88 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు మొత్తం 60 ఉండగా, 53 కోర్సుల్లో ప్రవేశాలకు ఓయూ జూలై 8 నుంచి 20 వరకు నిర్వహించింది.

సీట్ల సంఖ్య కంటే దర ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తక్కువగా ఉండటంతో 7 సబ్జెక్టులను మినహాయించారు. దీంతో 53 సబ్జెక్టుల్లో పరీక్షలు రాసేందుకు 90,354 మంది దరఖాస్తు చేసుకోగా, 78,032 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 74,815 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహత్మాగాం«దీ, పాలమూరు వర్సిటీలు, వాటి పరిధిలోని 264 కాలేజీల్లో 30,884 సీట్లు ఉన్నాయని వివరించారు.

ఓయూ ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్‌ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని పీజీ సెంటర్ల తొలగింపుపై వర్సిటీలకు సమాచారం లేదన్నారు. ప్రవేశాలు తక్కువగా ఉన్న పీజీ సెంటర్లను తొలగించేందుకు కళాశాల విద్యా శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందని, అయితే ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదన్నారు.  

తొలిసారిగా ఆన్‌లైన్‌లో.. 
మొదటిసారిగా రాష్ట్రంలోని అన్ని పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు ఓయూ రిజి్రస్టార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సెపె్టంబర్‌ ఒకటిన తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాం«దీ, పాలమూరు, తెలంగాణ వర్సిటీల్లో సర్టిఫికెట్ల వెరిఫి కేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 

మరిన్ని వార్తలు