పట్టా కావాలంటే.. మొక్కలు నాటాల్సిందే!

2 Jun, 2019 06:25 IST|Sakshi

డిగ్రీ చదువుకోవాలంటే ఏం కావాలి.. మనవద్ద అయితే ఇంటర్మీడియట్‌లో పాస్‌ కావాలి. కాలేజీలో సీటు రావాలి. ఆ తర్వాత పుస్తకాలు కొనుక్కోవాలి.. ఇంకా.. కాలేజీకి రెగ్యులర్‌గా వెళ్లాలి.. శ్రద్ధగా చదువుకోవాలి.. పరీక్షలు బాగా రాయాలి.. అప్పుడు కానీ పాస్‌కాలేం. కానీ ఫిలిప్పీన్స్‌లో మాత్రం డిగ్రీ చదవాలనుకునే ప్రతి ఒక్కరూ 10 మొక్కల చొప్పున నాటాలి. అదేంటి కొత్తగా ఉందే అని అనుకుంటున్నారా..? అవును ఒక్క డిగ్రీనే కాదు హైస్కూల్, కాలేజీ పూర్తి చేయాలన్నా కూడా మొక్కలు నాటాల్సిందేనట. ఈ మేరకు ఓ బిల్లును పార్లమెంటు సభ్యుడు గారీ అలెజానో ప్రవేశపెట్టాడు. ఈ విధానం వల్ల పిల్లల్లో మొక్కలు నాటాలనే తపన పెరుగుతుందని ఆయన వివరించారు. ఇలా ఒక్క తరం పిల్లలు, యువత నాటే మొత్తం మొక్కల్లో కనీసం 10 శాతం బతికినా దాదాపు 52.5 కోట్ల చెట్లు భూమిపై జీవం పోసుకుంటాయని అంచనా. దీంతో పచ్చదనానికి పచ్చదనం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆలోచన బాగుంది కదూ..!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భక్తజనం లేకుండానే రాములోరి కల్యాణం

చెట్లెంట.. పుట్లెంట..!

నల్లగొండలో 17 మంది బర్మా దేశీయులు

కల్యాణ వేళాయె..

కరోనా :అపోహలూ... వాస్తవాలు

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా