థింక్‌.. డిఫరెంట్‌

29 May, 2020 13:07 IST|Sakshi

పెద్దపల్లి: కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో చాలా మంది పనిలేదు.. ఉపాధి లేదు అంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సుల్తానాబాద్‌కు చెందిన ఈ ఫొటోగ్రాఫర్‌ రామకృష్ణ  విభిన్నంగా ఆలోచించాడు. శుభకార్యాలు లేక తాను కూడా ఉపాధి లేకపోవడంతో తన ఆలోచనలకు పదునుపెట్టి కరోనా కట్టడిని ఉపాధిగా మలుచుకున్నాడు. మాస్క్‌లు జీవితంలో తప్పనిసరి కావడంతో ఎవరికి నచ్చిన డిజైన్‌లలో వారి చిత్రాలతో మాస్క్‌లు తయారుచేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఒక్కో మాస్కును రూ.40కి విక్రయిస్తున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్

మరిన్ని వార్తలు