ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలి ప్రసవం  

2 Jun, 2018 12:34 IST|Sakshi
పుట్టిన శిశువుతో డాక్టర్‌ మంజుభార్గవి

జడ్చర్ల టౌన్‌ మహబూబ్‌ నగర్‌ : ప్రభుత్వ ఆశయాన్ని ఆచరణలో చూపించారు ఓ వైద్యురాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సం ఖ్య పెంచాలన్న ఆదేశాల మేరకు వైద్యు లు, సిబ్బంది గర్భి ణులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే, చెప్పడం కాదు తాను సైతం పాటించాలన్న భావనతో ఓ వైద్యురా లు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. జడ్చర్ల మండ లం గంగాపురం పీహెచ్‌సీలో డాక్టర్‌ మంజుభార్గవి, ఆమె భర్త డాక్టర్‌ విష్ణు నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ ఆమనగల్లులో నివాసముంటున్నారు.

ఈ దం పతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉండగా, ప్రస్తుతం మంజుభార్గవి గర్భంతో ఉంది. అయితే, తాను ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవిస్తానన్న ఆమె సూచనకు భర్తతో పాటు మిగ తా కుటుంబ సభ్యులు అంగీకరించారు. బుధవారం రాత్రి ఆమెను నొప్పులు రాగా, కల్వకుర్తి సీహెచ్‌సీకి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్‌ రమ ఆమెకు సిజేరియన్‌ ద్వారా కాన్పు చేశారు. రెండో కాన్పులో కూడా మంజుభార్గవి కుమారుడే జన్మించగా... మాటలు చెప్పడమే కాదు ఆచరణలో చూపించిన ఆమెను పలువురు అభినందించారు.  

>
మరిన్ని వార్తలు