మేక కడుపులో పందిని పోలిన పిల్ల

4 May, 2019 06:10 IST|Sakshi
మేక కడుపులో పంది ఆకారంలో జన్మించిన పిల్ల

ముర్కుంజాల్‌లో వింత

కంగ్టి(నారాయణఖేడ్‌): మేక కడుపులో పంది జన్మించిందంటే అందరూ వేళాకోలం అని కొట్టి పారేస్తారు. కానీ కంగ్టి మండలం ముర్కుంజాల్‌ గ్రామంలో ఓ మేక పందిని పోలిన పిల్లకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన రఘునాథ్‌రావు పాటిల్‌కు చెందిన మేక ఈనిన ప్రతీసారి నాల్గు పిల్లలకు జన్మనిచ్చేది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా నిండు చూలుతో ఉన్న మేక అస్వస్థతకు గురి కావడంతో సమీపంలోని తడ్కల్‌కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఎంఏ రహీం పరిశీలించి మందులు ఇచ్చారు.

కాగా గురువారం రాత్రి మేక మూడు మేక పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం మృతిచెందింది. మూడు మేక పిల్లలు జన్మించిన అనంతరం మేక కడుపు ఉబ్బెత్తుగా ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు మేక కడుపు కోసి చూడగా ఆశ్ఛర్యకరంగా వింత జంతువు బయట పడింది. వింత జంతువు పిల్ల దాదాపు ఐదు కిలోగ్రాముల బరువుతో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్తులే కాకుండా పొరుగు గ్రామాల నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చి వింతను తిలకించారు. ఈ విషయంలో వీఏఎస్‌ డాక్టర్‌ ఎంఏ రహీంను విచారించగా చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని పేర్కొన్నారు. దీనికి కారణం జన్యుపరమైన లోపాలని తెలిపారు.

మరిన్ని వార్తలు