స‌చివాల‌యం కూల్చివేత‌: అత్య‌వ‌స‌రంగా విచారించ‌లేం

8 Jul, 2020 12:32 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: తెలంగాణ సచివాలయంలో చేప‌ట్టిన‌ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధ‌వారం హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం(పిల్) దాఖ‌లైంది. ఈ మేర‌కు ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. భ‌వనాల కూల్చివేత వ‌ల్ల వాతావరణం కాలుష్యం ఏర్పడుతుందని, 5 ల‌క్ష‌ల మంది పీల్చే స్వ‌చ్ఛ‌మైన గాలి కలుషితం అవుతుందని తెలిపారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా కూల్చివేత చేప‌డుతున్నార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

దీనిపై ఉన్నత న్యాయ‌స్థానం స్పందిస్తూ.. దీన్ని అత్య‌వ‌స‌రంగా విచారించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా సచివాలయంలో ఏ, బీ, సీ, డీ, జీ, జే, కే, ఎల్, నార్త్‌ హెచ్, సౌత్‌ హెచ్‌ బ్లాకుల భవనాలు ఉండగా, మంగళవారం సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు సచివాలయం పక్కన ఉన్న రాతిభవనం కూల్చివేత పనులు దాదాపు పూర్తయ్యాయి. కూల్చివేత పనులు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. (సచివాలయం కూల్చివేత)

మరిన్ని వార్తలు