‘కొండగట్టు’ ఘటనపై హైకోర్టులో పిల్‌

26 Sep, 2018 02:41 IST|Sakshi

దాఖలు చేసిన బీజేపీ సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌:  జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యసేవలు అందించలేదని, మృతదేహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనలో 62 మంది మృతి చెందిన విషయం తెలి సిందే. కాలం చెల్లిన బస్సును నడిపేందుకు అనుమతి ఇచ్చిన జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ హనుమంతరావు, ఇతరుల గురించి మల్యాల పోలీసుల ఎఫ్‌.ఐ.ఆర్‌.లో ఉండేలా  పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కొండగట్టు ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా లేవని, బస్సులో 57 మంది ప్రయాణించేందుకు వీలుండగా 105 మం దితో కిక్కిరిసి వెళతూ ప్రమాదానికి గురైం దని వివరించారు.  బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించరాదని, ప్రమాదాల్లో గాయడిన వారికి నాణ్యమైన వైద్యమందించేందుకు మల్టీస్పెషాలిటి హాస్పిటళ్లకు తీసుకువెళ్లేలా చేయాలని కోరారు.  

మరిన్ని వార్తలు