వర్సిటీ అభివృద్ధికి ప్రణాళిక

29 Apr, 2015 03:11 IST|Sakshi

- దేశంలో అత్యుత్తమ వర్సిటీల్లో ఒకటిగా తెయూ
- ఎంపీ కల్వకుంట్ల కవిత

తెయూ(డిచ్‌పల్లి) :
తెలంగాణ యూనివర్సిటీని వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా రూపొందించడానికి కృషి చేస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్‌వన్  యూనివర్సిటీగా తీర్చిదిద్దటానికి మరిన్ని సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తామని అన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని తన అమెరికా పర్యటనలో చికాగో స్టేట్ యూనివర్సిటీతో తెలంగాణ యూనివర్సిటీకి మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) కుదర్చడం పట్ల ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపేందుకు రిజిస్ట్రార్ లింబాద్రి, ఇతర అధ్యాపకులు సోమవారం హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎంపీ కవిత, యూనివర్సిటీ అభివృద్ధికి తన ఆలోచనలను, అభిప్రాయాలను, సమగ్ర ప్రణాళికలను వివరించారు.

వర్సిటీలో ఫ్యాకల్టీ సభ్యులకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించడం వంటి ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. అనంతరం ఎంపీని రిజిస్ట్రార్ సన్మానించారు. ఆయన వెంట సైన్స్ డీన్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు, అసోసియేట్ ప్రొఫెసర్లు పాత నాగరాజు, ఎం.ప్రవీణ్, పీఆర్‌వో కె.రాజారామ్, పెద్దోళ్ల శ్రీనివాస్, సమత, ప్రసన్నరాణి ఉన్నారు.
 
యూనివర్సిటీ అభివృద్ధికి ఎంపీ సూచనల్లో కొన్ని...
- భిన్నమైన, ప్రత్యేక తరహా కోర్సులతో క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు
- వర్సిటీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాల, మేల్, ఫిమేల్ నర్సింగ్ అభ్యర్థులకు శిక్షణ
- సంప్రదాయేతర ఇంధన వనరులతో వర్సిటి విద్యుత్ అవసరాలు తీర్చడం, దీని కోసం సోలార్ పవర్, పవన విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు..
 - ప్రస్తుతం చికాగో స్టేట్ యూనివర్సిటీ ఎంఓయూతో పాటు ప్రిన్స్‌టన్, ఓహాయియో యూనివర్సిటీలతో కూడా ఎంఓయూల ఏర్పాటు. వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం..
 - వర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల సౌకర్యం కోసం 24 గంటల విద్యుత్ సరఫరా, ఎస్సారెస్పీ నుండి నిరంతర మంచి నీటి సరఫరా, 24 గంటల ఇంటర్నెట్ సౌకర్యం..
 - ప్రస్తుత ఫార్మా కంపెనీల సహకారంతో వర్సిటీలో పరిశోధనా, అభివృద్ధి సంస్థల ఏర్పాటు, విద్యార్థులకు ఉద్యోగావకాశాల కల్పన, ఇంక్యూబేషన్ సెంటర్ల ఏర్పాటు..
 - సైన్స్ విభాగాల కోసం ప్రత్యేక లాబోరేటరీ వసతులు, భవన నిర్మాణం..
 - వర్సిటీ భూముల రక్షణకు, సమర్థవంతమైన వినియోగానికి సమగ్ర మాస్టర్ ప్లాన్‌తో కూడిన అభివృద్ధి ప్రణాళికలు..
 - అంతర్గత రోడ్డ నిర్మాణం కోసం పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలశాఖ సహకారంతో పనులు..

మరిన్ని వార్తలు