సచివాలయంలో ప్లాస్టిక్‌ బంద్‌: సీఎస్‌ ఎస్‌.కె.జోషి

11 Aug, 2018 01:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయంలో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణానికి హాని కలిగించే అన్ని రకాల ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషి సర్క్యులర్‌ జారీ చేశారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందంతో ఉండే అన్ని రకాల ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లను, ఫ్లెక్సీలను, ప్లాస్టిక్‌ పోస్టర్లను సచివాలయంలో నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ నిషేధం నిబంధనలు ఉల్లంఘించినవారికి రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు.

సచివాలయంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాలని చేతన సచివాలయ సారస్వత వేదిక మే 25న ఇచ్చిన లేఖ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం అమలు నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిని విచారించేందుకు సాధారణ పరిపాలన శాఖకు చెందిన హెల్త్‌ సూపర్‌వైజర్‌ను నియమించారు.

మరిన్ని వార్తలు