వాస్తవాలు చెప్పండి..

15 Aug, 2014 03:37 IST|Sakshi

వర్ని :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న నిర్వహించనున్న సామాజిక కుటుంబ సర్వేపై ఎలాంటి భయాందోళనలు వద్దని, ఎన్యూమరేటర్లకు వాస్తవాలు తెలియజేయాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ సూచించారు.  గురువారం మండలంలోని అక్బర్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో  సర్వేపై నిర్వహిం చిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

 తొలుత స్థానికులకు  సర్వేపై ఎంత వరకు అవగాహన ఉందో ప్రశ్నల ద్వారా తెలుసుకున్నారు.అంశాల వారీగా చెప్పాల్సిన వివరాలు, ఎన్యూమరేటర్లకు చూపించాల్సి న ధ్రువపత్రాల గురించి వివరించారు. వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల సమాచారం తమ వద్ద ఉందని, తప్పుగా చెబితే విచారణలో వెల్లడవుతుందన్నారు. ఆధార్ కార్డు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంకు ఖాతా, పోస్టాఫీసు ఖాతా నంబర్‌ల ద్వారా లబ్ధిదారులు  నేరుగా ప్రభుత్వ సబ్సిడీని, విద్యార్థులు  స్కాలర్‌షిప్‌ను  పొందవచ్చని సూచిం చారు.  దళారుల సమస్య ఉండదన్నారు.

గ్యాస్ కనెక్షన్ వివరాలు తెలియజేయాలన్నారు. ఇప్పటికే ఏజెన్సీలు పూర్తిజాబితాను అందచేశాయన్నారు. వికలాంగులు సదరన్ సర్టిఫికెట్లు, రైతులు  వ్యవసాయభూమి వివరాలు, ఏ సర్వే నంబరు ఎం త భూమి ఉందో పూర్తిగా చెప్పాల న్నారు. ఎన్యూమరేటర్లకు ధ్రువపత్రాలు ఇస్తే, వారు సంబంధించిన నంబర్ న మోదు చేసుకుని తిరిగి ఇచ్చేస్తారన్నారు. అన్ని ధ్రువపత్రాల జిరాక్స్‌లు ఇవ్వాలనే ప్రచారం జరుగుతోందని పలువురు అ డుగగా, కలెక్టర్ పైవిధంగా చెప్పారు.

 19న అందరూ ఇంట్లో ఉండాలి
 ఈ నెల 19న అందరు ఇంట్లో ఉండాలని, దూర ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థుల గుర్తింపు పత్రాలు లేదా హాస్టల్ ఫీజు చెల్లింపు రశీదు తెచ్చుకోవాలని సూచించారు. వీ ఆర్‌ఏలు అందుబాటులో ఉండి సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్లకు  ఇళ్ల వివరాలు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేపై గ్రామస్తుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో గ్రామసర్పంచ్ రామాగౌడ్, ఉపసర్పంచ్ శంకర్,  సింగిల్ విండో చైర్మన్ పత్తి రాము, బోధన్ ఆర్డీవో శ్యాంసుందర్ లాల్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు