రూ.4వేల కోట్లతో భగీరథ పనులు

3 Mar, 2017 12:22 IST|Sakshi
రూ.4వేల కోట్లతో భగీరథ పనులు
► ఇంటింటికీ నల్లా నీరందిస్తాం
► రెండు జిల్లాల్లో 1645 గ్రామాలకు..
► మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
 
బాన్సువాడ :
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రూ.4వేల కోట్లతో చేపడుతున్న మిషన్‌ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయని, ఇంటింటికీ నల్లా నీరందివ్వడమే ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నివాసంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, సర్పంచులతో తాగునీటి పనులపై సమీక్ష నిర్వహించా రు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గానికి ఓ మండలాన్ని ఎంపిక చేసి, పైప్‌లైన్ల నిర్మా ణం చేపడుతున్నట్లు చెప్పారు. సింగూరు నుంచి వేస్తు న్న పైప్‌లైన్‌తో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్‌ నియోజకవర్గాలకు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వేస్తున్న పైప్‌లైన్‌తో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తామన్నారు.
 
మొత్తం 1645 గ్రామాలకు నీరందుతుందని వెల్లడించారు. మెయిన్, సబ్‌ ట్యాంకుల నిర్మా ణం ప్రారంభమైందని, ఇంట్రా పైప్‌లైన్‌ పనులను ప్రా రంభిస్తామన్నారు. నల్లా కనెక్షన్లు ఉచితంగా ఇసామని, గ్రామ పంచాయతీలో డిపాజిట్‌లు కూడా చేయాల్సిన అవసరం లేదన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్‌లలో పైప్‌లైన్ల కోసం రూ.26కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలోనే మొదటిసారిగా బాన్సువాడ పట్టణంలో పైప్‌లైన్లు వేసి, నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ అందరికీ స్వచ్ఛమైన జలాలు ఇవ్వడమే ధ్యేయంగా వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్‌ నార్ల సురేష్, నాయకులు మహ్మద్‌ ఎజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, అంజి రెడ్డి, గంగాధర్, అలీముద్దీన్‌బాబా, ముఖీద్, శ్రీధర్‌ ఉన్నారు.  
 
మంత్రికి ఘన సన్మానం..
అంగన్‌వాడీలకు, ఆయాల వేతనాలను పెంచేందుకు కృషి చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి గురువారం బాన్సువాడలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. కార్యకర్తలు లక్ష్మీ, విజయ, బాలమణి, స్వరూప, అరుణ పాల్గొన్నారు. 
 
రైతుల సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యత.. 
ధాన్యానికి గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు మార్కెట్‌ యార్డులను వినియోగించుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో రూ.1.5 కోట్లతో నిర్మించిన 2500 మెట్రిక్‌ టన్నుల గోదాంను గురువారం మంత్రి ప్రారంభించారు. రూ.70 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు, ప్రహరీ, రూ.35 లక్షలతో నిర్మించే మార్కెట్‌ కమిటీ కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రైతుల సంక్షేమం, అభివృద్ధికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
 
మార్కెట్‌ కమిటీ సేవలకు రైతుల ముంగిట్లోకి తీసుకురావడానికి కొత్త మార్కెట్‌లను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో 180 మార్కెట్‌ కమిటీలు ఉండగా, 4లక్షల 50వేల మెట్రిక్‌ టన్నుల గోదాంల సౌకర్యం ఉందన్నారు. ఇటీవల నాబార్డు సహకారంతో రూ.1024 కోట్లతో 17 లక్షల 50వేల మెట్రిక్‌ టన్నుల ఆదనపు గోదాంలను నిర్మించామని వెల్లడించారు. మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు నారోజీ గంగారాం, వైస్‌ చైర్మన్‌ మేక వీర్రాజు, జెడ్పీటీసీ గుత్ప విజయ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో సురేందర్, తహసీల్దార్‌ గంగాధర్‌ ఉన్నారు. 
 
వైద్యుల గైర్హాజర్‌పై మండిపాటు 
మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పోచారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. రోగులతో నిర్లక్ష్యంగా ఉంటున్నారని స్థానికులు కొంద రు ఫిర్యాదు చేయడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది రిజిష్టర్‌ను పరిశీలించారు. సి బ్బంది గైర్హాజర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగు పరుచుకోకుంటే చర్యలు కఠినంగా ఉంటాయ ని హెచ్చరించారు.  అంతకు ముందు కళాశాల అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇసుక నాణ్యతగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నాణ్యతగా లేకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  
 
మరిన్ని వార్తలు