బంగారు రైతే లక్ష్యం: పోచారం 

24 Sep, 2017 01:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగారు తెలంగాణలో బంగారు రైతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘దేశంలో సుస్థిర వ్యవసా యంపై అవగాహన’ అంశంపై శని వారం వరి పరిశోధన కేంద్రంలో రెండు రోజుల సదస్సును మంత్రి ప్రారంభించారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ రైతుల ఆదాయం పెరగటానికి ప్రభుత్వాలు అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయించినట్లుగా, వ్యవసాయ ఉత్పత్తుల ధరలను రైతులే నిర్ణయించే రోజు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోం దని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో కేంద్రం మార్పులు తీసుకురావాలని సూచించారు.   

మరిన్ని వార్తలు