క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం: పోచారం

8 Jun, 2017 13:53 IST|Sakshi
క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం: పోచారం
హైదరాబాద్‌: రాష్ట్రంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 16 శాతం ఉధ్యాన, సుగంద ద్రవ్యాల పంటలు పండుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బేగంపేటలోని టూరిస్ట్‌ ప్లాజాలో సుగంద ద్రవ్యాల అమ్మకం- కొనుగోలుదారుల సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్‌ కుమార్‌తో కలిసి వ్యవసాయశాఖ మంత్రి పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పసుపు పంట క్వింటా అమ్మితే తులం బంగారం వచ్చేది, కాని నేడు అందులో పదో వంతు ధర కూడా రావడం లేదు. రైతులు కష్టపడి పండించినా, ఉత్పత్తులకు మంచి మద్దతు ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. సుగంధ ద్రవ్యాల పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడం విచారకరం. పసుపు, మిర్చికి కనీస మద్దతు ధర లేక ఈ ఏడాది రాష్ట్రంలో రైతులు నష్టపోయారని అన్నారు. 
 
మరిన్ని వార్తలు