ధాన్య భాండాగారం పాలమూరు: స్పీకర్‌ పోచారం

19 Feb, 2020 09:58 IST|Sakshi
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను  ప్రారంభిస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి నిరంజన్‌రెడ్డి

కొత్త ప్రాజెక్టులతో ప్రతి గుంటకు సాగునీరు

ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర ప్రజలందరికీ తిండిపెట్టేంత సాగు భూమి

పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకే డబుల్‌ బెడ్‌రూం

ఇళ్ల నిర్మాణం: స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

సాక్షి, వనపర్తి : పేదవాడి ఆత్మగౌరవం సొంతింటితో పెరుగుతుంది.. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్‌ వందశాతం సబ్సిడీతో రెండు పడకల ఇంటిని పేదవారికి కట్టించేందుకు పూనుకున్నారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను అడ్డం పెట్టుకుని ప్రజాధనం స్వాహా చేసిన సంఘటనలు ఊరూరా కనిపిస్తాయన్నారు. నిజమైన ఇల్లు లేని పేద కంటుంబాలన్నింటికీ.. విడతల వారీగా.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లబ్దిదారుడికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. నేరుగా గృహప్రవేశం చేసుకునేలా సీఎం ఈ  పథకాన్ని రూపొందించారన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘణపురం మండలం ఈర్లతండా, కర్నెతండా, రేవల్లి మండలం  చెన్నారంలో రూ.5.20 కోట్లతో నిర్మించిన  డబుల్‌బెడ్‌రూం ఇళ్లను, జిల్లా కేంద్రంలో  రూ.60 లక్షలతో అభివృద్ధి చేసిన మున్సిపల్‌ పార్కులు, రూ.95 లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్, పాన్‌గల్‌ మండలం కొత్తపేట క్రాస్‌రోడ్‌ వద్ద బస్‌òÙల్టర్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

సాగునీరు లేక బీడు.. 
ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ తిండిపెట్టేంత సాగుభూమి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉందన్నారు. అలాంటి పాలమూరుపై పాలకుల చిన్నచూపుతో కావాల్సిన మేర సాగునీరందక వేలాది ఎకరాల భూమి బీడుగా మారిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వలస జిల్లాగా పేరున్న పాలమూరును పాడిపంటలతో సస్యశ్యామలం చేసేందుకు కొత్త ప్రాజెక్టులు, కాల్వలు, చెరువుల దురస్తు, సమాంతర కాల్వల బ్రాంచ్‌ కెనాన్స్‌ మంజూరు చేయటంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పచ్చని పంటలే దర్శనమిస్తున్నాయన్నారు. పాలమూరులోని పారుతున్న జీవనది కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఎక్కువ భూ భాగానికి సాగునీరు తీసుకువచ్చేందుకు జూరాల, భీమా, కేఎల్‌ఐ ప్రాజెక్టుల నుంచి పాత కాల్వలకు తోడుగా కొత్తగా కాల్వలను తవి్వంచి వ్యవసాయాన్ని పండగలా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని, అందుకే ఆయనకు నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరువచ్చిందన్నారు. 

42 లక్షల మందికి ఆసరా  
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తూ వృద్ధులు, వికలాంగులకు భరోసా ఇస్తుందని స్పీకర్‌ చెప్పారు. ఇందుకు ప్రతినెలా ప్రభుత్వం రూ.12 వేల కోట్లు వెచ్చిస్తోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, సీఈఓ నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ లక్ష్మయ్య, ఎస్పీ అపూర్వరావు, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సభ్యుడు సామ్యనాయక్, సింగిల్‌ విండో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు సాయిరెడ్డి, రంగారెడ్డి, సత్యం, రమేష్‌ కృష్ణయ్యగౌడ్, రాజు, పురుషోత్తం, చెన్నారం సర్పంచ్‌ రమే‹Ù, రేవల్లి ఎంపీపీ సేనాపతి, జెడ్పీటీసీ సభ్యుడు భీమయ్య తదితరులు పాల్గొన్నారు. 

ప్రతి నియోజకవర్గంలో ఇళ్లు.. 
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 1,400 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి నియోజక వర్గంలో ఇప్పటికే దాదాపుగా మంజూరైన అన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. ఖిల్లాఘనపురం మండలంలో 100 ఇళ్లకు గాను 67 ఇళ్లు పూర్తిచేయడంతోపాటు మరో 33 ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతుతన్నాయన్నారు. నియోజకవర్గానికి మరో వెయ్యి ఇళ్ల మంజూరుకు కృషిచేస్తామన్నారు. కర్నెతండాతోపాటు ఎత్తైన ప్రాంతాల్లోని బీడు భూములకు  కర్నెతండా లిఫ్టు ద్వారా వచ్చే వానాకాలం నాటికి సాగునీరు అందిస్తామన్నారు. ఈ లిఫ్టు మంజూరుకు సీఎంను కోరినట్లు మంత్రి చెప్పారు. 

మరిన్ని వార్తలు