కొలువే లక్ష్యం.. 

28 Feb, 2019 08:10 IST|Sakshi
100 మీటర్ల పరుగును ప్రాక్టీసు చేస్తున్న యువతులు

పోటీ అధికం.. ఉద్యోగ సాధనే యువత మంత్రం 

దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు 

జాగ్రత్తలు పాటించాలంటున్న శిక్షకులు 

రుగ్మతలుంటే పోటీ నుంచి తప్పుకోవాలంటున్న వైద్యనిపుణులు 

మార్చి 1నుంచి పోలీసు నియామకాలకు దేహదారుఢ్య పరీక్షలు 

ఉమ్మడి జిల్లా నుంచి హాజరు కానున్న 13,070 మంది అభ్యర్థులు 

ఆదిలాబాద్‌స్పోర్ట్స్‌: పోటీ ప్రపంచంలో ఉద్యోగసాధనే మంత్రంగా యువత తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా శాయశక్తులా యత్నిస్తోంది. పోలీసు ఉద్యోగం దక్కించుకునేందుకు అభ్యర్థులు లక్ష్యం దిశగా పరుగెడుతున్నారు. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల నియామకానికి చేపట్టే దేహదారుఢ్య పరీక్షల కోసం కఠోర సాధన చేస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పరీక్షల ప్రక్రియ ప్రారంభం కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అభ్యర్థులకు మార్చి 1 నుంచి 19వరకు ఆదిలాబాద్‌ పోలీసు పరేడ్‌ మైదానంలో జరగనున్నాయి. అభ్యర్థు లు ఇందులో నెగ్గాలంటే నిరంతర సా ధనతోనే సాధ్యమవుతుంది. పోటీల్లో నేరుగా పాల్గొంటే ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గుండె సంబంధిత రుగ్మతలున్నవారు పోటీ నుంచి తప్పుకోవడమే మేలంటున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మెలకువలు పాటించడం ద్వారా సునాయసంగా పరీక్షల్లో నెగ్గవ చ్చని శిక్షకులు సూచిస్తున్నారు. అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోటీల్లో నిర్వహించే పరీక్షలపై ప్రత్యేక కథనం..

దేహదారుఢ్య పరీక్షల అర్హత వివరాలు.. 

ఈవెంట్‌                    పురుషులకు    మహిళలకు 
100 మీటర్ల పరుగు:      15 సెకన్లు       20 సెకన్లు 
లాంగ్‌జంప్‌:                3.80 మీటర్లు    2.50 మీటర్లు 
షాట్‌పుట్‌:                 (7.26కేజీలు)    (4కేజీల బరువు)
                               6.60 మీటర్లు    3.75మీటర్లు  
హైజంప్‌:                   1.20 మీటర్లు    ఉండదు 
800 మీటర్ల పరుగు:    170 సెకన్లు    ఉండదు 

శరీరదారుఢ్య పరీక్షల్లో పరీక్షించే అంశాలివే... 
పోలీసు కొలువుల నియామకానికి నిర్వహించే దేహదారుఢ్య పరీక్షల్లో మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఈపరీక్షలు నిర్వహిస్తారు. పురుషులకు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్‌తోపాటుగా 100, 800 మీటర్ల పరుగును నిర్ణీత సమయంలో గా పూర్తి చేసి అర్హత సాధించాల్సి ఉంటుంది. మహిళలకు 100 మీటర్ల పరుగుతోపాటు లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుం ది. ఇవి పురుషులకు, మహిళలకు వేర్వేరుగా కొలతలు, నిర్ధారిత సమయాల్లో తేడాలుంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 
పరుగుపోటీల్లో ప్రధానంగా 100 మీటర్లు, 800 మీటర్ల పోటీలో పాల్గొనే ముందు అభ్యర్థులకు కనీసం 5 నిమిషాల స మయం ఉం టుంది. ఈ సమయంలో నిల్చున్నచోటే చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. శరీరాన్ని పరుగుకు అనుకూలంగా మార్చుకునేలా,  పరి గెత్తేటప్పుడు కండరాలు పట్టేయకుండా ఉండేలా సంసిద్ధీకరణ (వార్మప్‌) వ్యాయామాలు చేయాలి. హైజంప్, లాంగ్‌జంప్‌ ఈరెం డు పోటీల్లో పాల్గొనే ముందు కింద కూర్చుని తమ కాళ్లను వదులుగా చేయాలి. దీనివల్ల తొడ కండరాలు పట్టకుండా ఉంటాయి. అంతేకాకుండా మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. షాట్‌పుట్‌ వేసేముందు భుజాల వ్యాయామం చేయాలి. మెళుకువలతో సాధన చేసినవారు సులువుగా షాట్‌పుట్‌ను విసరవచ్చు.  

పోటీల్లో పాల్గొనే రోజు ఇలా చేయండి
దేహదారుఢ్య పరీక్షల రోజు భోజనం చేయవద్దు. పండ్లు, పండ్లరసాలతోపాటుగా కొద్ది మొత్తంలో డ్రైప్రూట్స్‌ తీసుకోవాలి. ద్రవపదార్థాలు వెంట ఉంచుకోవాలి. తక్షణ శక్తి కోసం నిమ్మరసం, గ్లూకోజ్‌పౌడర్‌ వంటివి వెంట తెచ్చుకోవాలి. అవసరమైన సందర్భంలో మితంగా తీసుకోవచ్చు. కూల్‌డ్రింక్స్‌ వంటివి వినియోగించవద్దు. దేహదారుఢ్య పరీక్షలకంటే ముందు ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడికి గురికాకుండా ఉండేలా కొద్దిసేపు ద్యానం చేయాలి. అన్నిటికంటే ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో పోటీలో పాల్గొంటే సులువుగా అర్హత సాధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పరుగు పోటీ కీలకం..
దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గాలంటే పరుగు పోటీ అతి కీలకమైంది. ముఖ్యంగా 100, 800 మీటర్ల పరుగు పోటీలు నిర్ధేశించిన సమయంలో పూర్తి చేయాల్సి ఉం టుంది. ఇందుకోసం అభ్యర్థులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తీవ్రంగా సా ధన చేసినవారు ఎక్కువ మంది సఫలం అయ్యే అవకాశాలుంటాయి. పరుగులో రాణించేలా ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. శిక్షకుడి పర్యవేక్షణలో పరుగును సాధన చేస్తే త ప్పులు సరిదిద్దుకునే అవకాశముంటుంది. పొరపాటునా కూడా ఏఅభ్యర్థి సాధన లేకుండా ఈ పో టీల్లో పాల్గొనవద్దు. గతంలోలాగా అనారోగ్యంగా ఉన్నవారికి మరోసారి పరీక్షలకు అవకాశం ఇవ్వాలి. – సుదర్శన్, మాజీ సైనికుడు, శిక్షకుడు, ఆదిలాబాద్‌ 

సాధన లేకుండా నేరుగా పాల్గొంటే..
దేహదారుఢ్య పరీక్షలకు సాధన లేకుండా నేరుగా పోటీల్లో పాల్గొంటే ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయని వైద్యనిపుణులు సూచిస్తున్నా రు. 100, 800 మీటర్ల పరుగు పోటీల్లో వేగంగా ప రిగెత్తే క్రమంలో గుండె వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. దీర్ఘంగా శ్వాస తీసుకునే సందర్భంలో ఊ పిరితిత్తుల్లోని కవాటాలు మూసుకుపోయి శ్వాస ఆగిపోయే అవకాశం ఉంటుంది. స్పృహ తప్పిపోతారు. ప్రాథమిక చికిత్స అందకపోతే మరణించే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఎలాంటి ప్రాక్టీసు లేకుండా హైజంప్, లాంగ్‌జంప్‌ పోటీల్లో నేరుగా పాల్గొంటే తొడకండరాలు పట్టుకోవడంతోపాటు మోకాలిచిప్పలు దెబ్బతింటాయి. కిందపడ్డప్పుడు ఎముకలు విరిగి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇక షాట్‌పుట్‌ను ఎలాంటి సాధన లేకుండా నేరుగా విసిరితే భుజానికి గాయమయ్యే ప్రమాదంతోపాటు షోల్డర్‌ డిస్‌లొకేట్‌ అయ్యే అవకాశాలుంటాయి.  

ప్రాక్టీసు చేసినవారే పాల్గొనాలి.. 
పోలీసు ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఎట్టి పరిíస్థితుల్లో సాధన చేయకుండా నేరుగా పోటీల్లో పాల్గొనవద్దు. కనీసం మూడు నుంచి నాలుగునెలలైనా ప్రాక్టీసు చేసి ఉండాలి. సాధన చేసేటప్పుడు శ్వాసలో ఇబ్బంది, చాతిలో నొప్పిలాంటివి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అపెండిక్స్, హెర్నియా, శస్త్రచికిత్సలు, స్టంట్‌ పడ్డవారు పోటీల్లో పాల్గొనకపోవడమే ఉత్తమం. గుండె సంబంధ వ్యాధులున్నవారు సైతం పోటీలకు దూరంగా ఉండాలి. పూర్తి స్థాయిలో సన్నద్ధమైనవారే దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలి. – మనోహర్, వైద్యుడు 

మరిన్ని వార్తలు