బెల్టుషాపులపై పోలీసుల మెరుపుదాడి

2 Jul, 2018 05:28 IST|Sakshi

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అన్నారం గ్రామాల్లోని బెల్టు దుకాణా లపై పోలీసులు ఆదివారం మెరుపు దాడి చేశారు. ‘గల్లీకో బెల్టు’అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి సివిల్‌ పోలీసులు స్పందించారు. ఆ రెండు గ్రామాల్లోని బెల్టు దుకాణాల్లో దాడులు నిర్వహించి సుమారు రూ.15 వేల విలువల గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అన్నారంలో ముగ్గురు, తుంగతుర్తిలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

సివిల్‌ పోలీసులు బెల్టుషాపులపై దాడులు చేస్తుంటే.. ఎక్సైజ్‌ శాఖ అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మండలవ్యాప్తంగా బెల్టుషాపులపై ఎక్సైజ్‌ పోలీ సులు దాడులు నిర్వహిస్తే పెద్దమొత్తంలో మద్యం లభించేదని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.  మద్యం దుకాణదారులు సిండికేట్‌గా ఏర్పడి బెల్టుషాపులకు క్వార్టర్‌పై రూ.10, బీరు పై రూ.10కి అదనంగా విక్రయిస్తున్నారు. బెల్టు షాపులవారు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ కన్నా రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా విక్రయిస్తున్నారు. దాడుల్లో సీఐ శ్రీనివాస్, ఎస్సై బాలునాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు