క్యారం సెంటర్లపై పోలీసుల దాడులు

24 Jul, 2018 14:33 IST|Sakshi

నిజామాబాద్‌ క్రైం : నగరంలోని ఆరు క్యారం సెంటర్లపై దాడులు చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్‌ నార్త్‌ సీఐ బుచ్చయ్య తెలిపారు. 5వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శాంతినగర్‌లో గల క్యారం బోర్డు సెంటర్లలో నిత్యం బెట్టింగ్‌లపై క్యారం ఆడుతున్నారనే సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి ఆరు క్యారం సెంటర్లపై దాడులు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బెట్టింగ్‌లపై క్యారం ఆడుతున్న 26 మందిని అదుపులోకి తీసుకుని రూ. 1,720 నగదు, 16 సెల్‌ఫోన్లు, 8 క్యారం బోర్డులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు