పోలీసుల అత్యుత్సాహం

17 May, 2014 02:45 IST|Sakshi

డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: డిచ్‌పల్లి సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద శుక్రవారం బందోబస్తు నిర్వహించిన పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని తేలిపోవడంతో కౌంటింగ్ ఎదురుగా జాతీయ రహదారిపై వేచి ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో నినాదాలు చేశారు. టపాకాయలు కాలు స్తూ నినాదాలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం ప్రధాన ద్వారం వైపు దూసుకురావడానికి యత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకుని నిలువరించారు.

ఇదే సమయంలో కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ ఆగ్రహించిన పోలీసులు ఒక్కసారిగా లాఠీలకు పని చె ప్పారు. కార్యకర్తలను ఇష్టమొచ్చిన రీతిలో చితకబాదుతూ పరుగులెత్తించారు. డిచ్‌పల్లి మండలం మల్లాపూర్ గ్రామ సర్పంచ్ భర్త భూమయ్యను చుట్టుముట్టి రోడ్డుపై పడవేసి చితకబాదారు. జై తెలంగాణ అంటూ సంబరాలు జరుపుకుంటే దాడులు చేస్తారా అని టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నడిపల్లి వైపు నుంచి విజయోత్సాహంతో నినాదాలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్దకు వస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలపై సైతం పోలీసులు లాఠీ చార్జి చేశారు. పోలీసుల దాడితో టీఆర్‌ఎస్ కార్యకర్తలు బారికేడ్ల కింద నుంచి దూరి దూరంగా పరుగులెత్తారు.

 జర్నలిస్టుపై దాడి..
 టీఆర్‌ఎస్ కార్యకర్తల సంబరాలను చిత్రీకరిస్తున్న వీడి యో జర్నలిస్టుపై పోలీసులు దాడి చేశారు. తాను జర్నలిస్టునని చెప్పినా విన్పించుకోకుండా కెమెరాను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్టులందరూ కౌంటింగ్ కేంద్రం ఎదుట ఎండలో బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఎస్పీ డౌన్‌డౌన్.. పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. చివరకు జర్నలిస్టు సం ఘాల నాయకులు కొందరిని కౌంటింగ్ కేంద్రంలోకి పిలిపించుకున్న ఎస్పీ వారిని సముదాయించడంతో జర్నలిస్టులు తమ నిరసన విరమించారు.

అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు అత్యుత్సాహంతో అడు గడుగునా జర్నలిస్టులను, రాజకీయ నాయకు లు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రశాంతంగా ఉన్న వాతావరణం పోలీసుల తీరుతో ఉద్రిక్తంగా మారిం దని జర్నలిస్టులు ఆరోపించారు. తాము ఇప్పటికి పలు ఎన్నికలను చూసామని, ఇలా ఎన్నడూ జరగలేదని జర్నలిస్టు నాయకులు అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు