వరుస చోరీలపై ఖాకీలు సీరియస్

6 Sep, 2014 02:48 IST|Sakshi

జమ్మికుంట  : జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాల్లో  జరుగుతున్న చోరీ ఘటనలపై  పోలీసులు దృష్టిసారించారు. దొంగలను పట్టుకునేందు కు గాలింపు ముమ్మరం చేశారు. అనుమానితులను,అపరిచిత వ్యక్తులను, ఇతర రాష్ట్రా ల నుంచి వచ్చి చిరువ్యాపారాల పేరిట గ్రామాల్లో సం చరిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జమ్మికుంట మండలంలోని జగ్గయ్య పల్లిలో ఉడుత చిన్న రాజమ్మ అనే వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో మృతి చెందగా...ఒంటిపై ఉన్న బంగారం అపహరణకు గురైంది.
 
ఈ నెల3న పట్టణంలోని వర్తక సంఘం ఏరియాలో మండలంలోని రాచపల్లికి చెందిన  కనుకలక్ష్మి మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును  అందరూ చూస్తుండగానే ముగ్గురు యువకులు దొంగలించారు. మరుసటి రోజు హుజూరాబాద్‌లోని ఓ ఇంట్లో  చోరీ జరగడంతో పోలీసులు  దొంగల కోసం గాలింపు చర్యలు  ముమ్మరం చేశారు.

గ్రామ శివారు ప్రాంతాల్లో డేరాలు వేసుకొని గ్రామాల్లో సంచార వ్యాపారాలు నిర్వహిస్తున్న మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్‌లకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చెల్పూర్ శివారులో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు డేరాలు వేసుకొని గ్రామాల్లో తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడున్న వారిని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం  ఇవ్వాలని  జమ్మికుంట ఎస్సై విద్యాసాగర్ సూచించారు.

>
మరిన్ని వార్తలు