కూంబింగ్‌ ముమ్మరం

19 Jan, 2019 04:23 IST|Sakshi

పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అలర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యా ప్తంగా మూడు దఫాలుగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలపై పోలీస్‌ శాఖ దృష్టి సారించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పలు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేసింది. ఇటీవల జరి గిన అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని అలజడి సృష్టించేందుకు మావోయిస్టు ప్రయత్నాలు చేసినా, రాష్ట్ర స్పెషల్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరో పోలీ సులు ఎప్పటికప్పుడు వారి చర్యలను పసిగట్టి వాటిని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. తాజాగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలను అడ్డుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా బృందాలు గుర్తించాయి.

మంచి ర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహ బూబాబాద్‌లోని కొన్ని గ్రామాల్లో స్థానిక దళాలు సంచరిస్తున్నట్టు తెలిసింది. దీనితో అక్కడ పోటీచేస్తున్న అభ్యర్థులు భయాందోళనకు గురైనట్టు సమాచారం. ఆయా జిల్లాల ఎస్పీలు గ్రేహౌండ్స్‌ బలగాలతో పాటు ప్రతీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టీఎస్‌ఎస్‌పీ(స్పెషల్‌పోలీస్‌)బృందాలను రంగం లోకి దించారు. ఆయా గ్రామపంచాయతీలు పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతంలో ఉండటంతో కూంబింగ్‌ విస్తృతంచేయాలని ఉన్నతాధికారులు సైతం ఆదేశించారు. దీనితో ప్రజలు అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరి గేలా వ్యవహరించాలని సూచించార 

మరిన్ని వార్తలు