ర్యాష్‌ డ్రైవింగ్‌పై ప్రశ్నిస్తే.. పోలీసుల బిడ్డలమంటూ..

13 May, 2019 14:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పోలీసు బైకుపై ముగ్గురు యువకులు అతివేగంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ స్థానికుల కంటపడ్డారు. పోలీస్ శాఖ కోట్లు ఖర్చు పెట్టి ప్రజల బందోబస్తు పటిష్టం చేయడానికని కొత్త వాహనాలు కొనిపెడుతుంటే, వారు మాత్రం తమకు తెలిసినవారికి, పిల్లల చేతికిచ్చి దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేస్తూ ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్న యువకులను వీడియా తీస్తూ వివరాల కోసం ఆరా తీస్తే, చెప్పేది పోయి గర్వంగా తాము పోలీస్ బిడ్డలమంటూ దాడిచేయడానికి ప్రయత్నించారు.

మాములుగా క్షమించాల్సిన తప్పులను కూడా భూతద్దంలో చూసే మన పోలీసుల్లో కొందరు తమ పిల్లలకు ట్రాఫిక్‌ నిబంధనలు నేర్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. సాటి తల్లితండ్రులకు సమావేశాలు నిర్వహించి యువత- ర్యాష్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు ఇలాంటి ఘటనల్లో ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి.

>
మరిన్ని వార్తలు