భద్రతా వలయంలో భాగ్యనగరం

18 May, 2019 09:08 IST|Sakshi
పాతబస్తీలో మోహరించిన పోలీసు బలగాలు

‘మే 18’ సందర్భంగా భారీ బందోబస్తు

తాజా పరిణామాల నేపథ్యంలో అదనపు చర్యలు

కీలక ప్రాంతాలకు ఇన్‌చార్జ్‌లుగా ఐపీఎస్‌ అధికారులు

ఇతర ప్రాంతాల్లోనూ ప్రత్యేక అధికారుల నియామకం

సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగిన రోజైన మే 18 (శనివారం) నేపథ్యంలో నగర పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేపట్టింది. చార్మినార్‌ సమీపంలోని మక్కా మసీదులో 2007 మే 18న బాంబు పేలుడు జరిగిన విషయం విదితమే. నగరంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గతానికి భిన్నంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తు కోసం సీసీఎస్, సిట్, స్పెషల్‌ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్, టీఎస్‌ఎస్పీ, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, సిటీ ఆర్‌ఏఎఫ్, క్యూఆర్టీ బలగాలను మోహరిస్తున్నారు.

బందోబస్తు ఏర్పాట్ల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా ఏర్పాటుకు పెద్ద ఎత్తున పోలీసులను మఫ్టీలో మోహరిస్తున్నారు. గతంలో సమస్యాత్మక పరిణామాలకు ఒడిగట్టిన వ్యక్తులను అనునిత్యం వెంటాడేందుకుగాను షాడో టీమ్‌లను ఏర్పాటు చేశారు. క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిఘా ఉంచారు. పాతబస్తీతో పాటు దక్షిణ మండలం, పశ్చిమ మండలం, తూర్పు మండలాల్లోనూ అడుగడుగునా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకుగాను అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. నగర వ్యాప్తంగా బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేయనున్నాయి. ఈ బందోబస్తు పర్యవేక్షణ కోసం కొందరు ఐపీఎస్‌ అధికారులు, ఇతర సీనియర్‌ అధికారులకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనికి సంబంధించిన జాబితాను కమిషనర్‌ కార్యాలయం సిద్ధం చేసింది. వీరు శనివారం ఆద్యంతం ఆయా ప్రాంతాలకు బాధ్యత వహించనున్నారు.  

అధికారి ఇన్‌చార్జ్‌ 
శికా గోయల్, అదనపు సీపీ సౌత్‌ జోన్‌
డీఎస్‌ చౌహాన్, అదనపు సీపీనగరం మొత్తం పర్యవేక్షణ
టి.మురళీకృష్ణ, అదనపు సీపీమాదన్నపేట, సైదాబాద్‌
అవినాష్‌ మహంతి, సంయుక్త సీపీగోషామహల్, ఆసిఫ్‌నగర్‌ డివిజన్లు
బీఎస్పీ రవికుమార్, కమాండెంట్‌మీర్‌చౌక్, చార్మినార్‌ డివిజన్లు
ఐఆర్‌ఎస్‌ మూర్తి, కమాండెంట్‌ సంతోష్‌నగర్‌ డివిజన్‌
ఎంఏ బారీ, అదనపు డీసీపీ అంబర్‌పేట
జి.జోగయ్య, అదనపు డీసీపీ మొఘల్‌పుర, భవానీనగర్‌
ఎంఆర్‌ బేగ్, కమాండెంట్‌ చార్మినార్‌/మక్కా మసీదు
ఎం.కృష్ణారెడ్డి, అదనపు డీసీపీ టప్పాచబుత్ర, కుల్సుంపుర
వి.దేవేందర్‌కుమార్, అదనపు డీసీపీబాంబు నిర్వీర్య బృందాలు
మద్దిపాటి శ్రీనివాసరావు, అదనపు డీసీపీమంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్‌
కేఎన్‌ విజయ్‌కుమార్, ఏసీపీఅంబర్‌పేట్‌
ఎన్‌బీ రత్నం, ఏసీపీ హుస్సేనిఆలం, షాలిబండ 

మరిన్ని వార్తలు