తనిఖీల్లో రూ. లక్షలు...కారు సీజ్‌

27 Nov, 2018 09:52 IST|Sakshi
పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు

సాక్షి,వాజేడు: హైవేపై తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారులో రూ.3లక్షలు ఎలాంటి ఆధారాలు లేకుండా కనిపించగా వాటిని స్వాధీనం చేసుకుని కారును సైతం సోమవారం సీజ్‌ చేసినట్లు స్టాటికల్‌ సర్వే లాన్స్‌ టీమ్‌ అధికారులు రమాదేవి, బాజ్జీప్రసాద్, మురళీకృష్ణ తెలిపారు. వారి కథనం ప్రకారం...కారును తనిఖీ చేయగా కారులో రూ. 3లక్షలు కనిపించాయి. వాటిని సంబంధించి  వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బులు, కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  ఆ డబ్బులను ఆంధ్రప్రదేశ్‌లోని  సామర్ల కోట నుంచి రూ 3 లక్షలను హన్మకొండకు తీసుకు వస్తున్నట్లు కారులో వస్తున్న జీవీవీ సత్యనారాయణ, అచ్చన్న చౌదరిలు తెలిపారు. ఆధారాలను చూపించాలని కోరినప్పటికి వారు ఎలాంటి ఆధారాలను చూప లేదు. దీంతో స్వాధీనం చేసుకుని కారును వాజేడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించి నగదును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారికి అందజేసినట్లు తెలిపారు. 

 జనగామ: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ అధికారులు పట్టణంలోని నెహ్రూ పార్కు వద్ద సోమవారం తనిఖీలు చేపట్టారు. లింగాలఘణపురం మండలం నవాబుపేటకు చెందిన శంశొద్దీన్‌ రూ.4,25 లక్షల నగదు తీసుకువెళ్తుండగా, తనిఖీల్లో గుర్తించారు. నగదుకు సంబంధించి పూర్తి ఆధారాలు చూపించడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి వినయ్‌రెడ్డి తిరిగి ఇచ్చేశారు. దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన మరోవ్యక్తి యాదగిరి వద్ద స్వాధీనం చేసుకున్న రూ.81వేలకు లెక్కలు చూపించకపోవడంతో ట్రెజరీలో జమ చేశారు. ఇద్దరి వద్ద ఒకేసారి నగదు పట్టుబడడంతో గంట పాటు పోలీసులు, ఎలక్షన్‌ టీం సిద్దిపేట, జనగామ వైపు వెళ్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్సై రాజేష్‌నాయక్, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీం ప్రతినిధులు నరేష్, నరోత్తంరెడ్డి, షబ్బీర్‌ ఉన్నారు.

>
మరిన్ని వార్తలు