వీడనున్న ‘తోహాస్‌’ అక్రమాల గుట్టు 

7 Apr, 2018 02:25 IST|Sakshi
తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి (ఫైల్‌ పొటో)

క్రిమినల్‌ కేసు నమోదుకు నిర్ణయం

రవాణాశాఖపై ఆరోపణల నేపథ్యంలో కదలిక  

సాక్షి, హైదరాబాద్‌ : ట్రక్‌ పార్కింగ్‌కు కేటాయించిన స్థలాన్ని తప్పుడు పత్రాలతో ప్రైవేటు గోదాములకు లీజుకిచ్చిన వ్యవహారంలో ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దర్జాగా ఈ ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటుపరం చేసేందుకు దాని నిర్వాహకులే బరితెగించినా చూసీచూడనట్టు పోయిన రవాణాశాఖ అధికారులు దానిపై కేసు నమోదుకు సిద్ధపడ్డారు. కేసు నమోదుకు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం రవాణా మంత్రి సమీక్ష నిర్వహించారు. గత కాం గ్రెస్‌ ప్రభుత్వం పెద్ద అంబర్‌పేటలోని హెచ్‌ ఎండీఏ స్థలాన్ని ట్రక్‌ పార్కింగ్‌ కోసం రవాణాశాఖకు కేటాయించింది.

దీన్ని ‘ట్రక్‌ ఆపరేటర్స్‌ హైవే ఎమినిటీస్‌ సొసైటీ(తోహాస్‌)’ పేరుతో నిర్వహిస్తున్నారు. దీన్ని నేరుగా రవాణాశాఖ కాకుండా తోహాసే పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహణ బాధ్యతలు చూసే ఓ కీలక వ్యక్తి తప్పుడుపత్రాలతో ఆ స్థలంలో ప్రైవేటు గోదాముల ఏర్పాటుకు తెరతీశాడు. దీని వెనక పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి.  అది ప్రభుత్వ భూమి అయినందున అధికారుల నిఘా కచ్చితంగా ఉండాలి. దీనిపై ఫిర్యాదుల వచ్చినా సకాలంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా