భారీగా నకిలీ విత్తనాల పట్టివేత

12 Jun, 2017 19:56 IST|Sakshi

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని ఆర్బీనగర్ లో నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. సుమారు రూ. కోటి తొమ్మిది లక్షల విలువజేసే నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రవికుమార్‌, శ్రీనివాస్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో పది మంది నిర్వాహకులు పరారయ్యారని, రెండు కార్లు, ఒక డీసీఎం  స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్‌ డీసీపీ పద్మజా తెలిపారు. 

మరిన్ని వార్తలు