పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి

5 Apr, 2015 01:33 IST|Sakshi
పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి

సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో జరిగిన రెండు దుర్ఘటనలపై ప్రభుత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనల్లో పోలీసులు మరణిస్తే పరిహారమిచ్చి తమ పని అయిపోయిందని ప్రభుత్వం అనుకొంటే సరిపోదన్నారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. పోలీసు కుటుంబాలకు, గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు.

 

మృతుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కాల్పులు, ఇమాంపేట వద్ద గెయిల్ పరిశ్రమ గ్యాస్‌పైప్‌లైన్ లీకేజీలో ఇద్దరు మృతి సంఘటనలపై లోతైన అధ్యయ నం అవసరమన్నారు. పోలీసుల ధైర్య సాహసాలు అభినందించాల్సిందేనన్నా రు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిం దని చెప్పారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు