నెన్నెలలో ఆధిపత్య పోరు..! 

5 Sep, 2019 14:20 IST|Sakshi

గొడవలకు దిగుతున్న ఇరువర్గాలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైనం 

సాక్షి, బెల్లంపల్లి: అక్కడ ఆధిపత్య ధోరణి పరాకాష్టకు చేరుకుంది. రెండువర్గాలు సమఉజ్జీలుగా మారి ఏ తీరైన గొడవలకైనా ‘ సై ’ అంటున్నాయి. రాజకీయ పరంగా శత్రువులుగా మారి ఏ సమస్యనైనా సరే అనువుగా మల్చుకుంటున్నారు. భార్యాభర్తల గొడవలు, కుటుంబ తగాదాలు, పొలంగట్ల జగడాలు,  రా జకీయ, ఇతరత్రా గొడవలకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇరువర్గాలు చె రోదిక్కు చేరిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడం అక్కడ రెండేళ్ల పైబడి నుంచి నిరాటంకంగా సాగుతోంది.  ప్రతి స మస్యను రాజకీయపరంగా మలు చు కుని ఆ రెండు వర్గాలు క్రమంగా శాంతిభద్రతలకు భంగం వాటిళ్లేలా ప్రవర్తిస్తున్నాయి. అధికార పక్షంగా ఓవర్గం, విపక్షంగా మరో వర్గం ప్రతి సమస్యను గొడవలకు దారితీసేలా వ్యవహరిస్తుండటంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. నెన్నెల మండలంలో ఆధిపత్య అహంకారం తలకెక్కి వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

వివవాదాలకు మారుపేరుగా ...   
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న నెన్నెల మండలం ఇటీవలి కాలంలో వివాదాలకు మారుపేరుగా నిలుస్తోంది. రెం డేళ్ల పైబడి నుంచి అధికార, విపక్షాలుగా ఉన్న రెండువర్గాలు ఏ అంశంలోనూ వెనక్కితగ్గకుం డా కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. చివరికి వారిపైత్యం భార్యాభర్తల గొడవల వరకు కూడా వెళ్లినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నా యి. గ్రామాలలో ఏ ఇద్దరు తగువులాడినా ఓ వ్యక్తి పక్షాన ఓవర్గం, మరోవ్యక్తి పక్షాన ప్రత్యర్థి వర్గం దూరిపోయి ఆధిపత్యం కోసం ఘర్ష ణ వాతావరణానికి పురిగొల్పుతున్నారనే వి మర్శలు ఉన్నాయి.  

రాజకీయ పరంగా కూడా పంతాలు, పట్టింపులకు పోవడం, ఒకరిపై ఒకరు పోలీసు ఠాణాల్లో ఫిర్యాదు చేసుకోవడం, విచారణ చేపట్టకముందే  కేసు నమోదు కోసం పోలీసులపై వొత్తిళ్లు తేవడం, తాము చెప్పిందే నడవాలనే అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారు. భూ ఆక్రమణలు, భూ వివాదాలకు దిగడం, దౌర్జన్యంగా వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా  అల్లర్లకు దిగడం ఓవ ర్గం నాయకుడికి పరిపాటిగా మారిందని గ్రా మీణులు పేర్కొంటున్నారు. ఓ ముఖ్యనేతకు బినామీగా ఉండి అతడి అండదండలతో ఎవర్నీ లెక్కచేయకుండా దుందూకుడుగా వ్యవహరించడం జరుగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు.

అదేతీరుగా ఆ వర్గానికి ప్ర త్యర్థిగా వ్యవహరిస్తున్న వర్గం కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో  ఇరువర్గాల మధ్య కక్షలు పెరిగి పోతున్నాయి. వ్యక్తిగతంగా, ఆస్తుల పరంగా ఆ రెండువర్గాల ముఖ్యనాయకుల మధ్య తగాదాలేం లేకపోయినా రాజకీయ పరంగా వైరివర్గాలుగా మారి ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ అంటున్నారు. ఈ పరిస్థితులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు  పోలీసులకు సరికొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.

రూట్‌ మార్చిన పోలీసులు  
నెన్నెల మండలంలో జరుగుతున్న ఘర్షణలు, ఇతరత్రా  అంశాలకు ఎటు తిరిగి శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తున్నట్లు పోలీసువర్గా లు అంచనాకు వచ్చాయి. ఏ  వర్గానికి నచ్చజెప్పినా వినకపోగా పైపెచ్చు పోలీసులు ప్రత్యర్థి వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా రని దుష్ప్రచారం చేయడం, ఉన్నతాధికారుల కు తప్పుడు ఫిర్యాదులు చేస్తుండటంతో ఇక్కడి వర్గ రాజకీయాలలో అనివార్యంగా పోలీసులు పావులుగా మారాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం నడస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు భిన్నంగా పోలీసు ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘ట్రబుల్‌ మాంగర్స్‌’ గా ముద్రపడ్డ 16 మందిని మంగళవారం కౌన్సెలింగ్‌కు పిలిపించి తమదైన ధోరణిలో  మర్యాద చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. ఈ అంశం ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   
మచ్చుకు కొన్ని సంఘటనలు.. 

  • నెన్నెల మండల కేంద్రంలో ఓవర్గ నాయకుడు భూకబ్జాకు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చి వివాదంగా మారింది. ఆవ్యవహారంపై రామాగౌడ్‌ అనే వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. చివరికి ఆ వ్యవహారంలో ఓ వ్యక్తి పేరుమీద తప్పుడు కుల ధృవీకరణ పత్రం తీసుకుని తనపై తప్పుడు కేసు పెట్టించారని రామాగౌడ్‌ మనస్థాపం చెంది మంచిర్యాల కలెక్టరేట్‌కు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  
  • లంబాడి తండాలో ఓ మహిళ మంత్రాలు చేస్తోందని అనుమానించి ఆమెపై దాడి చేసిన ఘటనలో ఓ వర్గం నాయకుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.  
  • గొడవలకు దిగడం నైజంగా మార్చుకున్న ఓవర్గం నాయకుడిని ఇటీవల సత్ప్రవర్తన కోసం పోలీసులు నెన్నెల  తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. కానీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులు మరో కేసు పెట్టారు.   
  • మరో వర్గానికి చెందిన ఓ నాయకుడు తానేమీ తక్కువగా కాదన్నట్లుగా ఓ కేసు వ్యవహారంలో జోక్యం కల్పించుకుని  ఏకం గా ఏఎస్సైపై దౌర్జన్యానికి పాల్పడమే కాకుండా అతడి  విధులకు ఆటంకం కలిగించడంతో ఆ నాయకుడిపై కేసు నమోదైంది.  
  • ప్రభుత్వ భూమిని కబ్జాచేశాడని నెన్నెల మండలానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఓ వర్గం నాయకుడిపై హైకోర్టులో కేసు వేయడం, ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉండడం విశేషం.    
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా