‘వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్‌ కల్పించాలి’

17 Oct, 2017 16:10 IST|Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): వికలాంగులకు రాజకీయాల్లో గ్రామస్థాయి నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్లు కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని న్యూ అంబేద్కర్‌భవన్‌లో వీహెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో సోమ వారం నిర్వహించిన సమావేశంలో ఆమె మా ట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా వికలాంగులకు అన్యాయం జరుగుతోందని, సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు.

 రాజకీయంగా అవకాశం కల్పించడం లేదని, వికలాంగులను ప్రభుత్వా లు చిన్నచూపు చూడడం సరికాదన్నారు. రాష్ట్రం లో 20లక్షల వికలాంగ ఓటర్లున్నారని తెలిపా రు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు చదువుకునే వారికి మోటారు వాహనాలు, ట్యారీ సైకిళ్లు అందించాలన్నారు. ఉపాధి కల్పన శాఖ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి వివి ధ శాఖల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. వికలాంగులతో దుర్భాషలాడిన వారిపై అట్రాసిటీ చట్టం తేవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు నారాయణ ఉన్నారు.

మరిన్ని వార్తలు