ఆర్థిక అంశాలపైనే రాజకీయాలు 

9 Sep, 2019 03:01 IST|Sakshi

దేశ ఆర్థిక పరిస్థితి–మూల్యాంకనం 

సదస్సులో కోదండరాం 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఆర్థిక అంశాలపైనే భవిష్యత్తు రాజకీయాలు కొనసాగుతాయని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో వర్తమాన ఆర్థిక పరిస్థితి – మూల్యాంకనంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ.. ఆర్థిక పరిణామాలు ఎటుపోతాయనేది రాజకీయ పార్టీలు చర్చించాలన్నారు. రాజకీయ రంగమే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతుందని, అంతిమంగా ఆర్థిక వనరులను సరిగ్గా వినియోగించగలిగేది రాజకీయాలేనన్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్థిక అంశాలపై అవగాహన పెం పొందించుకోవాలన్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టడం, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం కూడా కారణమేనని ప్రొఫెసర్‌ నరసింహారెడ్డి అన్నారు. ఎలక్ట్రికల్‌ వాహనాలు ప్రోత్స హించేందుకు కేంద్రం చర్యలు చేపట్టడంతో వాహ నాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఎలక్ట్రికల్‌ వాహనాలు వస్తాయని వాటిని కొనడం మానేశారని ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ అంజిరెడ్డి అన్నారు. 

మరిన్ని వార్తలు