పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రశాంతం

9 Jun, 2014 22:51 IST|Sakshi
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రశాంతం

- తొలిసారి రాజగోపాల్‌పేటలోనూ కేంద్రం ఏర్పాటు
- సిద్దిపేట విద్యార్థులకు తప్పిన వ్యయప్రయాసలు

సిద్దిపేట జోన్: పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ సోమవారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు 1 నుంచి 20 వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ర్యాంకర్ల ధృవీకరణ పత్రాల పరిశీలించి ఆప్షన్స్ నమోదు చేసుకున్నారు. స్పెషల్ కేటగిరీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని మంగళవారం 20 వేల నుంచి 40 వేల వరకు, ఆ తర్వాతి రోజు మరో 20 వేల మందికి ఇలా 16వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

తప్పిన వ్యయప్రయాసలు
గతంలో సిద్దిపేటలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కేంద్రం లేకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులంతా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ జిల్లాలకు పరుగు తీసేవారు. అయితే తొలిసారి రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలోనూ అధికారులు కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో  ఈ ప్రాంత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు