ఆంజనేయుడి దయతో బయటపడ్డా: పొంగులేటి

12 May, 2015 14:35 IST|Sakshi
ఆంజనేయుడి దయతో బయటపడ్డా: పొంగులేటి

న్యూఢిల్లీ : ఆంజనేయ స్వామి దయతో తాము పెద్ద భూకంపం నుంచి బయటపడ్డామని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఢిల్లీ భూకంపం జోన్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశాన్ని భూకంపం మరోసారి వణికించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో పాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పొంగులేటి భూకంపంపై పైవిధంగా స్పందించారు. భూప్రకంపనల గురించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన అన్నారు.

 

మరిన్ని వార్తలు