‘నేను.. నాపాలన.. నాఇష్టంగా’ మారింది

7 Mar, 2017 18:00 IST|Sakshi
‘నేను.. నాపాలన.. నాఇష్టంగా’ మారింది
జనగామ జిల్లా: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం..నేడు నేను.. నాపాలన.. నాఇష్టంగా మారిందని  విమర్శించారు. జనగామలో విలేకరులతో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కాస్త బాధల తెలంగాణగా మారిందన్నారు.
 
రైతులు, ఉద్యోగులు, పోలీసులు స్తెతం ఆత్మహత్యలకు పాలుపడుతుడండం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రుణమాఫీ పథకం వడ్డీ మాఫీ పథకంగా, మిషన్ భగీరథ కాస్త మిషన్ కల్వకుంట్లగా మారిందన్నారు. మిషన్ భగీరథ పథకంప్తె బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాలపై ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు.
 
 
 
 
 
మరిన్ని వార్తలు