కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు

3 Jun, 2018 07:21 IST|Sakshi
సోనియా చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న పొన్నం 

చిగురుమామిడి(హుస్నాబాద్‌) : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తున్న సీఎం కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిగురుమామిడిలో సోనియాగాంధీ చిత్రపటానికి కార్యకర్తలతో కలసి క్షీరాభిషేకం చేశారు. ఈ పథకాలు, ఆ పథకాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నేటికి నెరవేరలేదని, మళ్లీ కొత్త వాగ్దానాలతో రైతులు, ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు.

రైతుబంధు పథకం ఉన్నవాడికే లాభదాయకమన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఒరిగిందేం లేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు తప్పనిసరిగా 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వంగర మల్లేశం, డీసీసీ కార్యదర్శి చిటుమల్ల రవీందర్, ఎస్సీ, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ బోయిని సురేశ్, మాజీ దేవస్థానం చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి, మండల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు బాబుమియా, నాయకులు కాటం సంపత్‌రెడ్డి, గజ్జేల రాములు, కూతురు మల్లారెడ్డి, మహిళా అధ్యక్షురాలు పచ్చిమట్ల లక్ష్మి, గాజుల అంజారెడ్డి, పోటు మల్లారెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు