టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలదీయండి

10 Nov, 2018 13:37 IST|Sakshi
మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌

 టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌

కొత్తపల్లి:  మిషన్‌ భగీరథ నీరు, డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వకుండా ఓట్లడగమన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు..ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ముఖంతో గ్రామాల్లోకి వస్తున్నారో నిలదీయాలని..టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ కోరారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్, రేకుర్తి గ్రామాల్లో ఎమ్మెల్సీ  టి.సంతోష్‌కుమార్, టీపీసీసీ కార్యదర్శిచలిమెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి శుక్రవారం బైక్‌ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయ జన్మనిచ్చిన టీడీపీపైనే అహంకారపూరితంగా కమలాకర్‌ వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు.

తొమ్మిదిన్నరేళ్లలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఏంటో..ఐదేళ్లలో తాను ఎంపీగా చేసిన అభివృద్ధి ఏంటో చర్చించుకుందామా అంటూ సవాల్‌ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి, కళ్యాడపు ఆగయ్య, జాడి బాల్‌రెడ్డి, మాజీ మేయర్‌ శంకర్, గందె మాధవి, ఎంపీటీసీలు జక్కుల నాగరాణి మల్లేశం, బొమ్మ ఈశ్వర్‌గౌడ్, నాయకులు రాచకొండ ప్రభాకర్, ఖాజాఖాన్, బోనాల మురళి, మూల వెంకటరవీందర్‌ రెడ్డి, జువ్వాడి మారుతిరావు, ఎండి చాంద్, దుర్గం మనోహర్‌ పాల్గొన్నారు.

మహాకూటమి గెలుపు ఖాయం:
రాష్ట్రంలో సాగుతున్న రాచరిక పాలనను అంతం చేయడానికే మహాకూటమిగా జట్టుకట్టామని.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడ్డ ఓటమి తప్పదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, అన్నారు. శుక్రవారం టవర్‌సర్కిల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలుపించాలని కోరారు.  

 5వ డివిజన్‌లో..
ఎస్సీసెల్‌ నగర కాంగ్రెస్‌ కమిటీ నాయకులు కల్వల రాంచందర్‌ ఆధ్వర్యంలో 5వ డివిజన్‌లో పొన్నం ప్రభాకర్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు పొన్నం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 9వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ తౌటి శంకరయ్య ఆధ్వర్యంలో వంద మంది యువకులు పొన్నం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నందగిరి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో పలువురు వికలాంగులు కాంగ్రెస్‌లో చేరారు. 20వ డివిజన్‌లోని కాపువాడకు చెందిన వాసాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో పొన్నం సమక్షంలో చేరారు.

మరిన్ని వార్తలు