‘డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే’

13 Oct, 2019 12:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెందిన ఆయన శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి వద్దకు చేరుకున్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. 
(చదవండి : డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత)

ఆయన మాట్లాడుతూ..  ‘శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్  పార్టీ అండగా ఉంటుంది. కార్మికులు ఎవరు ధైర్యం కోల్పోవద్దు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్‌కుతగులుతుంది. శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే’అన్నారు.

శ్రీనివాస్‌రెడ్డి మృతి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను  నిర్వీర్యo చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీమకుట్టినట్టుగా కూడా లేదు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఆర్టీసీ సమ్మెకు ముందు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కొన్ని షరతులతో మద్దతు తెలిపిన మాట నిజమే. రేపు సీపీఐ పార్టీ అత్యవసర సమావేశంలో మద్దతు ఉపసంహరణపై  చర్చిస్తాం’అన్నారు.
(చదవండి : గూండాగిరీ నడవదు.. కేసీఆర్‌ తీవ్ర హెచ్చరికలు)

మరిన్ని వార్తలు