‘వెల్గటూరు’ ఆదర్శనీయం: కేసీఆర్‌

3 Jan, 2020 03:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ స్వశక్తీకరణ్‌ పురస్కార్‌కు ఎంపికైన వెల్గటూరు మండలాన్ని సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. వెల్గటూరు మండలం ఆదర్శనీయమని కొనియాడారు. 2017–18 సంవత్సరానికిగాను కేంద్రం ప్రకటించిన ఈ అవార్డును మాజీ మండల పరిషత్‌ అధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాసరావు ఇటీవల అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సహకారంతో గురువారం ఆయన ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు