పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది

15 Jul, 2019 12:04 IST|Sakshi
అరుణ్‌కుమార్‌కు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు

ఎస్‌ఐ ఉద్యోగం సాధించిన సురేశ్‌

తండ్రి ట్రాక్టర్‌ డ్రైవర్‌ తల్లి వ్యవసాయ కూలీ

హర్షం వ్యక్తం చేసిన స్థానికులు

మహేశ్వరం: తండ్రి ట్రాక్టర్‌ డ్రైవర్‌ అయినా.. పేదరికం వెంటాడుతున్నా కృషి పట్టుదలతో రేయింబవళ్లు కష్టపడి చదివి పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ ఉద్యోగం సాధించారు.  మండల పరిధిలోని సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాసుల అరుణ్‌కుమార్‌  ఏఆర్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అంబర్‌పేట్‌లో పోలీస్‌ కానిస్టెబుల్‌గా విధులు నిర్వహిస్తూనే ఎస్‌ఐ పరీక్షలకుసిద్ధమై ఏఆర్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు పద్మ, భాస్కర్‌ దంపతులకు అరుణ్‌కుమార్‌ పెద్ద కుమారుడు. తల్లి రోజువారి వ్యవసాయ  కూలీ, తండ్రి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా గ్రామంలో పని చేస్తున్నారు.  అరుణ్‌కుమార్‌ 1వ తరగతి నుండి 10 తరగతి వరకు మహేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్‌  తుక్కుగూడలోని వి/êన్‌కాలేజ్‌ జూనియర్‌ కాలేజ్,  హైదరాబాద్‌లోని ప్రభుత్వ సిటీ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కష్టపడి చదివి ఏలాగైనా ఉన్నతమైన ఉద్యోగం సాధించి  గ్రామానికి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడురు. తల్లిదండ్రులు రోజు వారి కూలీలు.

వారి కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంతో ఉన్నతమైన ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నారు. డిగ్రీ పూర్తి  2016లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం  సాధించారు. అటు ఉద్యోగం చేస్తూనే  ఎస్‌ఐ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న విడుదలైన ఎస్‌ఐ పరీక్ష ఫలితాల్లో పోలీస్‌ ఎగ్జిక్యూటివ్‌ కోటాలో 219 మార్కులు సాధించి ఏఆర్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు.  కాసుల అరుణ్‌కుమార్‌  ఏఆర్‌ ఎస్‌ఐగా ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్‌ఐగా అరుణ్‌కుమార్‌ సెలెక్ట్‌ కావడం గర్వంగా ఉందని గ్రామ సర్పంచ్‌ కాసు సురేశ్‌ అన్నారు. అరుణ్‌కుమార్‌ని చిన్నప్పటి నుంచి చదువుల్లో ప్రోత్సహించేవాడినని, ఉద్యోగం సాధించడం మండలానికే గర్వకారణంగా ఉందని సర్పంచ్‌ సురేశ్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలుషిత ఆహారం తిన్నందుకు....

పోలీస్‌ @ అప్‌డేట్‌

హైదరాబాద్‌కు 48 రోజులే నీళ్లు అందించగలరా?

హామీలను సీఎం నిలబెట్టుకోవాలి

సర్కారు బడికి.. సర్పంచ్‌ కుమార్తె..

కాకతీయుల స్థావరాలు

ఒరిగిన బస్సు.. తప్పిన ముప్పు

బెంబేలెత్తిస్తున్న గ్రామ సింహాలు

రోడ్డు ప్రమాదంలో సబ్‌ ఇంజనీర్‌ మృతి

తాగడానికే నీళ్లులేవు.. మొక్కలు ఎలా పెంచాలి?

లెక్క తేలలేదు..

కొత్వాల్‌ కొరడా..! 

సెల్‌టవర్‌ బ్యాటరీ దొంగల అరెస్ట్‌

‘డిజిటల్‌’ కిరికిరి! 

113 మందిపై అనర్హత వేటు 

టీఆర్‌ఎస్‌కు మావోయిస్టుల హెచ్చరిక

వివాదాస్పదంగా బిగ్‌బాస్‌

ఏసీబీకి చిక్కిన ఐఐటీ టాప్‌ ర్యాంకర్‌

మున్సిపల్‌ ఓటర్ల జాబితా సిద్ధం

స్పెషలిస్టులు ఊస్టింగే?

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

పాత నోట్లు.. కొత్త పాట్లు!

ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం

‘విద్యుత్‌’పై ఎల్‌సీ వద్దు 

దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ

మానసిక రోగులకు హాఫ్‌వే హోంలు! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!