‘పేదల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ కర్తవ్యం’

1 Dec, 2018 14:23 IST|Sakshi

సాక్షి, బల్మూర్‌: కాంగ్రెస్, టీడీపీ పాలనలో వెనకబాటుకు గురైన తెలంగాణ పేద ప్రజల సంక్షేమమే కర్తవ్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని మాజీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గ్వుల బాల్‌రాజ్‌ సతిమణి అమల అన్నారు. శుక్రవారం కొండనాగులలో ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తన భర్త గువ్వల బాల్‌రాజ్‌ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు.

అనంతరం గంగపుత్ర సంఘానికి చెందిన మహిళలు అమల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమితి సభ్యురాలు అరుణమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రమోహన్, మాజీ సర్పంచ్‌ సలెమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


 గువ్వలను మెజార్టీతో గెలిపించాలి 
అచ్చంపేట రూరల్‌: పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అధిక మెజార్టీతో గెలిపించాలని కౌన్సిలర్లు, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. శుక్రవారం పట్టణంలోని ఆయా కాలనీల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కౌన్సిలర్లు నిర్మలబాలరాజు, శివ, మనోహర్‌ప్రసాద్, శ్రీను, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


టీఆర్‌ఎస్‌ ఇంటింటి ప్రచారం 
లింగాల: మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గువ్వల బాలరాజుకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తిర్పతయ్య, మాజీ ఎంపీపీ జగపతిరావు, నాయకులు తిర్పతయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాకారం, కోమటికుంట, శాయిన్‌పేట, దత్తారంలో ప్యటించి కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యకర్తలు పాల్గొన్నారు.


అభివృద్ధిని చూసి ఓటేయ్యండి 
ఉప్పునుంతల: మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలున్నర ఏళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి కారుగుర్తుకు ఓటు వేసి గువ్వల బాల్‌రాజును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గోపాల్‌రెడ్డి, వెంకటయ్య, జంగయ్య, ఎల్లయ్యయాదవ్, బక్కయ్య, సీహెచ్‌ తిర్పతయ్య, గణేష్, బాలస్వామి, చిన్న జంగయ్య  పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు