పోస్టల్‌స్టాంపుల్లో బాపూజీ

2 Oct, 2014 03:36 IST|Sakshi
పోస్టల్‌స్టాంపుల్లో బాపూజీ

చరిత్రలో ఎన్నడూలేని విధంగా 91 ప్రపంచదేశాలు దాదా పు 250 మహాత్మాగాంధీ చిత్రాల తో కూ డిన పోస్టల్‌స్టాంపుల ను వెలువరించాయి. ఇంగ్లిష్ వారివి తప్ప ఎవరిపైనా స్టాంపులను వెలువరించని ఇంగ్లాడ్ సహితం గాంధీ చిత్రంతో పోస్టల్‌స్టాంపులు వెలువరించడం విశేషం. ఏడేళ్ల ప్రాయంలో ప్రాథమిక పాఠశాల దశలో ఉన్న చిత్రంతో బార్బుడా దేశం 1931లో స్టాంపును విడుదలచేసింది. అలాగే 1948లో నాలుగు జతల గాంధీస్టాంపును మనదేశం మొట్టమొదటి సారిగా ఆవిష్కరించింది. అలాగే 1969లో సతీమణి కస్తూర్బాతో కలిసి ఉన్న గాంధీ స్టాంపును వెలువరించారు. 1980లో దండియాత్రకు సంబంధించిన రెండుజతల గాంధీజీ స్టాంపులను వెలువరించారు. 2005లో 70 ఏళ్ల ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా నాలుగు జతల స్టాంపులను వెలువరించారు. సత్యాగ్రహ ఉద్యమానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా  2007లో నాలుగు జతల స్టాంపులను వెలువరించారు. వీటన్నింటిని తెలుగు ఉపాధ్యాయుడు కమలాకర్ శ్యాంప్రసాద్‌రావు సేకరించి పదిలపరిచారు.



 

మరిన్ని వార్తలు