మెట్రో నగరాల తెలుగు ప్రముఖులనూ ఆహ్వానిస్తాం

2 Nov, 2017 01:28 IST|Sakshi
పోస్టర్‌ను విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి 

ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ 

సాక్షి, హైదరాబాద్‌:  దేశంలోని పెద్ద నగరాల్లో ఉన్న తెలుగువారిని ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించేందుకు ఈనెల 4, 5 తేదీల్లో కోర్‌కమిటీ సభ్యులు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లో పర్యటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తెలిపారు. అక్కడి తెలుగు ప్రముఖులకు ఆహ్వానపత్రాలు అందించి ఆన్‌లైన్‌లో వారుపేర్లు నమోదు చేసుకునేలా చూస్తారని వెల్లడించారు.

బుధవారం ఆయన రాష్ట్ర అధి కార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉప కులపతి ఎస్‌వీ సత్యనారాయణ, పర్యాటక, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి.వెంక టేశం, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణతో కలసి సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు సాహితీ సంస్థలు, సాహితీ ప్రముఖులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి సహకారా న్ని కోరామన్నారు. రవీంద్రభారతి ప్రాంగణం లో ప్రత్యేకంగా కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.  

మరిన్ని వార్తలు