కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

16 Sep, 2019 17:57 IST|Sakshi

రేపు నర్సరావుపేటలో కోడెల అంత్యక్రియలు

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు మంగళవారం నర్సరావుపేటలో జరగనున్నాయి. మరోవైపు కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తియింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డు చేశారు. అలాగే కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ బృందం పరిశీలించగా, ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. 

ఎన్టీఆర్‌ భవన్‌కు కోడెల భౌతికకాయం
పోస్ట్‌మార్టం అనంతరం భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు తరలించారు. టీడీపీ నేతలు ట్రస్ట్‌ భవన్‌ చేరుకుని, కోడెలకు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ రాత్రి అక్కడే ఉంచి, రేపు (మంగళవారం) ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌లో కోడెల పార్దీవదేహంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకష్‌ రోడ్డు మార్గంలో బయల్దేరనున్నారు. సూర్యాపేట, విజయవాడ మీదగా మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సందర్శకుల కోసం కొద్దిసేపు ఉంచి, అనంతరం నర్సరావుపేట తీసుకు వెళతారు. 

మరోవైపు కోడెల అనుమానాస్పద మృతిపై బంజారాహిల్స్‌ ఏపీసీ ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు అయింది. సిట్‌ బృందం కోడెల నివాసంలో తనిఖీలు నిర్వహించి, ప్రత్యక్ష సాక్షులు, సెక్యూరిటీ, డ్రైవర్‌ను ప్రశ్నించారు. క్లూస్‌ టీమ్‌ కూడా పలు ఆధారాలను సేకరించింది.

చదవండి:


శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు

కోడెల మృతితో షాక్కు గురయ్యాను...

కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!

కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి

కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి

కోడెల మృతిపై కేసు నమోదు

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?

సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!

కోడెల శివప్రసాదరావు కన్నుమూత

మరిన్ని వార్తలు