నర్మెటలో బయటపడిన మృణ్మయపాత్రలు

18 Mar, 2017 04:51 IST|Sakshi
తవ్వకాల్లో దొరికిన మృణ్మయ పాత్ర , శంఖాలు

నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట వద్ద పురావస్తుశాఖ అధికారులు కొనసాగిస్తున్న తవ్వకాల్లో శుక్రవారం మృణ్మయ పాత్రలు బయట పడ్డాయి. ప్రాచీన మాన వుడు ఉపయోగించిన నాలుగు పాత్రలు, ఎరుపురంగు కౌంచ్‌ తో ఉన్న రెండు శంఖాలు, మట్టిపాత్రలు పెట్టుకునేందుకు రింగ్‌ స్టాండ్, నలుపురంగు పాత్ర లభించాయి.

నక్షత్ర రాశులు, సంవత్సరంలో వచ్చే కాలాలను గుర్తించే విధంగా బండపై చెక్కిన ఆనవాళ్లను గుర్తించారు. పురావస్తుశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగరాజు మాట్లాడుతూ   చనిపోయిన వ్యక్తి ఉపయోగించిన వస్తువులు, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు మట్టికుండల్లో ఉంచినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మెన్‌హీర్‌ వద్ద గుర్తించిన పెద్ద రాతి సమాధి సుమారుగా 40 టన్నుల వరకు బరువు ఉన్నట్లు అంచనా వేశామని అన్నారు

మరిన్ని వార్తలు