చరిత్ర సృష్టించేలా ప్రగతి నివేదన సభ  

24 Aug, 2018 08:49 IST|Sakshi
సభా స్థలం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 

నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు

హోమంత్రి నాయినినర్సింహారెడ్డి

కొంగరకలాన్‌లో సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఇబ్రహీంపట్నంరూరల్‌ :  ప్రగతి నివేదన సభ పేరుతో టీఆర్‌ఎస్‌ నిర్వహించే బహిరంగ సభ దేశంలోనే చరిత్ర సృష్టిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని సభాస్థలాన్ని చదును చేసే పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు చేసిన సేవలను ఇక్కడ వివరిస్తామని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.

తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ప్రాణాలు లెక్కచేయకుండా రాష్ట్రం సాధించాడన్నారు. 25 లక్షల మందితో సభ ఏర్పాటు చేసి సత్తా చాటుతామని నాయిని చెప్పారు. డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ మాట్లాడుతూ మైనార్టీలకు రూ.2వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించింది టీఆర్‌ ఎస్‌ సర్కార్‌ మాత్రమేనని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి మైనార్టీ హాస్టళ్లను ప్రారం భించిందని, 50 వేల మంది పిల్లలు నేడు హాస్టళ్లల్లో చదువుతున్నారనితెలిపారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్‌ఎస్‌ సభ జరగబోతోందన్నారు. సెప్టెంబర్‌ 2న ఉప్పొంగే జనసంద్రానికి ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయన్నారు.

మరిన్ని వార్తలు