'ప్రాణహిత’పై పర్యావరణ కమిటీకి ప్రజెంటేషన్‌

3 Mar, 2017 03:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రాణహిత’ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యా వరణ శాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ (ఈఏసీ) ఎదుట రాష్ట్ర అధికారులు గురువారం ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రాణ హిత నీటిని తమ్మిడిహెట్టి ద్వారా మళ్లించే ప్రక్రియ పర్యావరణ, ఆర్థిక, నిర్వహణ పరంగా అనుసరణీయంగా ఉంటుందని వివరించారు. పర్యావరణ మదింపు చేసుకునేందుకు విధి విధానాలను (టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌–టీఓఆర్‌)ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత రూ.1,919 కోట్ల అంచనా, 56 వేల ఎకరాలకు నీరందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అయితే తర్వాత రూ.4,231 కోట్ల అంచనాతో 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొం దించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి.. 14.4 టీఎంసీల నీటిని తరలి స్తారు. ఈ అన్ని అంశాలపై ఈఏసీ కమిటీ ముందు ప్రాజెక్టు సీఈ భగవంతరావు వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు