బడ్జెట్‌లో వాటర్‌గ్రిడ్‌కు ప్రాధాన్యం

21 Oct, 2014 00:51 IST|Sakshi
బడ్జెట్‌లో వాటర్‌గ్రిడ్‌కు ప్రాధాన్యం

ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం
దీపావళి తర్వాతే అసెంబ్లీ సమావేశాలుంటాయని వెల్లడి


హైదరాబాద్: దీపావళి తర్వాత నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో సమర్పించే బడ్జెట్‌లో వాటర్‌గ్రిడ్ పథకానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇన్నేళ్లుగా తెలంగాణకు ప్రాధాన్యత లభించలేదని, ఇప్పుడు పూర్తిగా తెలంగాణ ధోరణిలోనే బడ్జెట్ ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే బడ్జెట్‌లో ప్రస్ఫుటం కావాలని సూచిం చారు. బడ్జెట్‌పై ఆర్థిక శాఖతోపాటు ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇందులోభాగంగా శనివారం సమావేశమైన కేసీఆర్.. సోమవారం నాడు మరోసారి మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(నాక్) కార్యాలయంలో వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులతో భేటీ నిర్వహించి బడ్జెట్‌కు తుది రూపునిచ్చారు. బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఓ అధికారి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి నేరుగా సమాధానమివ్వలేదు. దీపావళి తర్వాత అని మాత్రమే చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశాలను ఆషామాషీగా నిర్వహించరాదని, ప్రభుత్వ ప్రాధాన్యతలన్నీ బడ్జెట్‌లో ప్రతిబింబించాల్సిన అవసరముందన్నారు. నాలుగు నెలల వ్యయం కోసం బడ్జెట్ అనుమతితోపాటు, ఆరు నెలల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోవాల్సి ఉందన్నారు.
 

>
మరిన్ని వార్తలు