లాక్‌డౌన్‌ : కాన్పుకు వెళ్తే.. పొమ్మన్నారు 

25 Apr, 2020 09:39 IST|Sakshi

సాక్షి, గద్వాల ‌: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళితే.. అధిక రక్తపోటు, తక్కువ రక్తం ఉందని వైద్యు లు కాన్పు చేయమన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేరే ఆస్పత్రికి వెళ్దామన్నా గత్యంతరం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ గర్భిణి ఆసుపత్రి ఆవరణలోనే బెంచీపై పడుకొని తీవ్ర అవస్థలు ఎదుర్కొంది. పురిటి నొప్పులతో ఆమె పడుతున్న వేదనను చూడలేక భర్త ఆమె బాధను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇదంతా జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. (775కు చేరిన కరోనా మృతుల సంఖ్య)

మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలింపు..  
అయిజ మండలం యాపదిన్నెకి చెందిన జెనీలియా అనే గర్భిణిని డెలవరీ కోసం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రికి భర్త మహేంద్ర తీసుకొచ్చాడు. ఆస్పత్రి సిబ్బంది జెనీలియాకు పరీక్షలు నిర్వహించగా అధిక రక్తపోటు, తక్కువ రక్తం ఉండడంతో డెలివరీ చేయడం సాధ్యం కాదంటూ బయటకు పంపేశారు. దీంతో భర్త మహేంద్ర ఏం చేయాలో దిక్కుతోచక సంఘటనపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనిపై డీఎస్పీ యాదగిరి వెంటనే స్పందించారు. పోలీసు సిబ్బందిని ఆస్పత్రికి పంపించారు. జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓతో మాట్లాడి గర్భిణిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు.  
(విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే)

మరిన్ని వార్తలు