వైద్యం అందక గర్భిణి మృతి

28 Sep, 2017 07:24 IST|Sakshi

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ క్రైం : సరైన వైద్యం అందకటో నిండు గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని తూడుకుర్తి గ్రామానికి చెందిన బండి స్వప్న(26)కు అచ్చంపేట మండలం తోడేళ్లగడ్డకు చెందిన తిరుపతయ్యతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. ప్రస్తుతం స్వప్న గర్భిణి కావడంతో కొంతకాలంగా బిజినేపల్లిలోని గురుకుల పాఠశాలలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తూ తన తల్లిగారింట్లోనే ఉండేది.

తాను గర్భం దాల్చినప్పటి నుంచి నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేది. మంగళవారం సాయంత్రం పురిటి నొప్పులతో ఆస్పత్రికి రాగా పరిస్థితి విషమించిందని ఆస్పత్రి వైద్యులు తెలిపి మహబూబ్‌నగర్‌ ఎస్వీఎస్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడికి వెళ్లిన స్వప్న చికిత్స పొందుతూ మృతిచెందింది. నాగర్‌కర్నూల్‌ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు సమయానికి వైద్యం అందించకపోవడం వల్లే పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మరిన్ని వార్తలు